Tue Dec 24 2024 16:32:31 GMT+0000 (Coordinated Universal Time)
మూవీ ఇన్ ఏపీ.. ఫిట్టింగ్ పెట్టిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్ల టిక్కెట్ల ధర పెంపుపై ప్రభుత్వం ఫిట్టింగ్ పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్ల టిక్కెట్ల ధర పెంపుపై ప్రభుత్వం ఫిట్టింగ్ పెట్టింది. కేవలం తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలోని 225 థియేటర్లకు మాత్రమే ఆ తీర్పు వర్తిస్తుందని పేర్కొంది. ఏపీలోని మిగిలిన థియేటర్లన్నింటిలో జీవో నెంబరు 35 వర్తిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తెలిపారు. ఆ థియేటర్లు తప్ప ఎవరూ టిక్ెట్ల ధరలను పెంచుకునేందుకు వీలు లేదని ఆయన తెలిపారు.
ఆ థియేటర్ల వరకే....
225 థియేటర్ల యజమానులు కూడా జాయింట్ కలెక్టర్ అనుమతి తీసుకుని పెంచాల్సి ఉంటుందని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో కోర్టును ఆశ్రయించిన ఆ జిల్లాలకు చెందిన థియేటర్లకు మాత్రమే తీర్పు వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఏపీలోని మిగిలిన థియేటర్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే టిక్కెట్లను విక్రయించాల్సి ఉంటుంది.
Next Story