Mon Dec 23 2024 02:51:34 GMT+0000 (Coordinated Universal Time)
Free Gas Cylender : గుడ్ న్యూస్ అందరికీ ఉచిత గ్యాస్...సిలిండర్ అందకుంటే ఈ నెంబర్ కు డయల్ చేయొచ్చు
దీపావళి నుంచి ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది
దీపావళి నుంచి ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. బుక్ చేసిన వెంటనే ఆ నగదును వెంటనే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉండాలి. అర్హత ఉండాలి. రేషన్ కార్డు కూడా ఉండాలి. పారదర్శకంగా ఎక్కువ మందికి అందేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్ బుక్ చేసుకోగానే ప్రజలకు ప్రభుత్వం నుంచి మెసేజ్ సెల్ ఫోన్ కు వస్తుంది. కూటమి ప్రభుత్వం నుంచి దీపావళి కానుకగా మహిళలకు అందిస్తున్న ఉచిత పథకాన్ని అందరూ వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు...
గ్యాస్ కంపెనీలు కూడా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంటుందని నాదెండ్ల మనోహర్ కోరారు. ఏడాదిలో మూడు దశల్లో గ్యాస్ సిలిండర్ పంపిణీ జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అర్హులైన కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. 1.25 లక్షల మంది కార్డు దారులన్నారని, అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ ను అందచేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 1 జూన్ 30వ తేదీ వరకూ ఒకసారి, ఆగస్టు 2 నుంచి నవంబరు 30 వరకూ మరొకసారి, డిసెంబరు 1 నుంచి మార్చి 31 వరకూ మూడో దఫా గ్యాస్ బుక్ చేసుకోవచ్చని నాదెండ్ల తెలిపారు.
1967 నెంబరుకు...
ఈ పథకానికి 2,684 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినట్లు ఆయన వివరించారు. అర్హులైన వారికి ఎవరికైనా ఈ పథకం అందకపోతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఇందుకోసం 1967 నెంబరుకు డయల్ చేయవచ్చని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ నెంబరుకు కాల్ చేసి తమ అర్హతలను తెలియజేస్తే గ్యాస్ బుక్ అవుతుందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ బుక్ అయిన తర్వాత ఆ డబ్బులు ప్రభుత్వం నుంచి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు. ఏపీ వ్యాప్తంగా దీపావళి నుంచి ఈ ఉచిత గ్యాస్ పథకం ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
Next Story