Fri Dec 20 2024 10:29:46 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఐఏఎస్ ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్ ను నియమించింది. అలాగే మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్ధిగా కె సునీత నియమితులయ్యారు. సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా గంధం చంద్రుడిని బదిలీ చేశారు.
విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా....
కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ గా కార్తికేయ మిశ్రాను నియమించారు. కాపు కార్పొరేషన్ ఎండీగా రేఖారాణి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా రంజిత్ భాషాను ప్రభుత్వం నియమించింది. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈఓగా రమణారెడ్డిని, ఏపీ భవన్ స్పెషల్ ఆఫీసర్ గా హిమాన్షు శుక్లాకు అదనపు బాధ్యతలను అప్పగించారు. సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ సొసైటీ సెక్రటరీగా ఆర్ పవన్ మూర్తిని నియమించారు.
Next Story