Tue Dec 24 2024 00:18:43 GMT+0000 (Coordinated Universal Time)
పయ్యావుల సెక్యూరిటీ తొలగింపు
పయ్యావులకు గన్ మెన్లను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది
పయ్యావులకు గన్ మెన్లను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పయ్యావవుల వద్ద ఉన్న గన్ మెన్లను వెనక్కు రావాల్సిందిగా ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన పయ్యావుల కేశవ్ పీఏసీ ఛైర్మన్ గా ఉన్నారు.
విత్ డ్రా చేయడంపై....
పయ్యావుల కేశవ్ కు సెక్యూరిటీ విత్ డ్రా చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పీఏసీ ఛైర్మన్ గా ఉన్న పయ్యావుల కు భద్రత ఎందుకు కల్పించరన్న ప్రశ్నను టీడీపీ ఎమ్మెల్యేల నుంచి వస్తుంది. ఇటీవల తమ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆయన ఆరోపించిన నేపథ్యంలోనే పయ్యావుల సెక్యూరిటీని ప్రభుత్వం విత్ డ్రా చేసినట్లు తెలుస్తోంది.
Next Story