Mon Dec 23 2024 13:40:47 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్ తీపి కబురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 66 మందికి పదోన్నతులు కల్పించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 66 మందికి పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని 66 మంది తహసిల్దార్లు, సెక్షన్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్ క్యాడర్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పదోన్నతులు...
జీవో 747 ప్రకారం వీరంతా కొత్తగా డిప్యూటీ కలెక్టర్లుగా పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 24 రెవెన్యూ డివిజన్ కేంద్రాల ఏర్పాటు చేసిన నేపథ్యంలో వీరికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 198 మందితో ఏర్పాటు చేసిన అడహాక్ ప్యానల్ నుంచి 66 మందిని ఎంపిక చేసి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పదోన్నతులు తాత్కాలికం మాత్రమేనని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Next Story