Wed Oct 30 2024 15:17:34 GMT+0000 (Coordinated Universal Time)
సత్తా చాటిన ఏపీ.. ఫస్ట్ ర్యాంక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సత్తా చాటింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సత్తా చాటింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. బిజినెస్ రిఫార్మ్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020 లో ప్రధమ స్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపటి క్రితం ర్యాంకుల వివరాలను వెల్లడించారు. టాప్ లో ఉన్న ఏడు రాష్ట్రాలను కేంద్ర మంత్రి ప్రకటించారు.
దక్షిణాది రాష్ట్రాలకు...
ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో గుజరాత్ నిలిచింది. తెలంగాణకు నాలుగో స్థానం లభించింది. గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు టాప్ అఛీవర్స్ గా నిలిచాయి. దక్షిణాది రాష్ట్రాలే టాప్ పది ప్లేస్ లో నిలిచాయి. మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించి ర్యాంకులను ప్రకటించారు. అఛీవర్స్ లిస్టులో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
Next Story