Mon Dec 23 2024 10:43:55 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలో ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్
త్వరలో ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల కాయిన్ ను భారత ప్రభుత్వం విడుదల చేయనుంది
త్వరలో ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల కాయిన్ ను భారత ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇది వరకే ఈ విషయాన్ని ప్రకటించినా మింట్ కాంపౌండ్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి పురంద్రీశ్వరిని కలిసి ఆమె సలహాలను కోరారు. పురంద్రీశ్వరికి కాయిన్ నమూనాను అధికారులు చూపించారు.
పురంద్రీశ్వరితో...
ఎన్టీఆర్ బొమ్మ ముద్రించేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీని నమూనాను తయారు చేసిన అధికారులు ఎన్టీఆర్ పెద్ద కుమార్తె పురంద్రీశ్వరికి చూపించి ఆమె నుంచి అనుమతి తీసుకున్నారు. త్వరలోనే వంద రూపాయల ఎన్టీఆర్ బొమ్మతో కూడిన నాణేన్ని భారత ప్రభుత్వం విడుదల చేయనుంది. గతంలోనూ వాజ్పేయి వెండి నాణాన్ని ముద్రించిన సంగతి తెలిసిందే. పురంద్రీశ్వరి అనుమతి తీసుకున్న తర్వాత నాణేన్ని ముద్రించి విడుదల చేయనున్నారు.
Next Story