Fri Apr 25 2025 04:04:57 GMT+0000 (Coordinated Universal Time)
గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఏపీ సర్కార్ సీరియస్
గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రభుత్వం పోలీసు అధికారులను నివేదిక కోరింది

గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రభుత్వం పోలీసు అధికారులను నివేదిక కోరింది. గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేసినప్పుడు ఆయన స్టేషన్ వద్ద సెల్ ఫోన్ మాట్లాడుతున్నారని, ఆ ఫోన్ ఎవరు ఇచ్చారని ప్రభుత్వం అధికారులను ప్రశ్నించింది. ఫోన్ ఎవరిదని? మాధవ్ ఎవరితో మాట్లాడారో నివేదిక ఇవ్వాలని కోరింది. నిన్న వైఎస్ భారతిని దూషించిన కేసులో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను వెంబడించిన గోరంట్ల మాధవ్ పోలీసుల విధులను కూడా అడ్డుకున్నారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నివేదిక ఇవ్వాలంటూ...
ఈ కేసులో అరెస్ట్ చేయడమే కాకుండా, నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంలూ గోరంట్ల మాధవ్ పై మరో కేసు నమోదయింది. పోలీసులపై గోరంట్ల మాధవ్ దురుసుగా ప్రవర్తిస్తున్నా పోలీసులు మిన్నకుండా చూస్తుండటాన్ని పలువురు తప్పుపట్టారు. గోరంట్ల మాధవ్ ను నిలువరించే ప్రయత్నం చేయలేదన్న అభిప్రాయం వ్యక్త మయింది. చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేసి తీసుకు వస్తున్నారన్న సమాచారాన్ని కూడా గోరంట్ల మాధవ్ కు పోలీసుల నుంచి ఎవరు ఇచ్చారన్న దానిపై నివేదిక కోరింది. దీనిపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది.
Next Story