Sun Dec 22 2024 15:50:50 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh: చంద్రబాబు ప్రమాణస్వీకారంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం కారణంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం కారణంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. వేసవి సెలవులు 11వతేదీతో ముగియనున్నాయి. అయితే ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వేసవిసెలవులను ఒకరోజు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
12న ప్రారంభం కావాల్సి ఉండగా...
వాస్తవానికి 12న ప్రారంభం కావాల్సిన ప్రభుత్వ పాఠశాలలు చంద్రబాబు ప్రమాణ స్వీకారం కారణంగా ఒక రోజు వాయిదా వేశాయి. ఏపీలో పాఠశాలలు ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం తెలిపింది. వేసవి సెలవులు ముగియనుండటంతో పాటు 12న చంద్రబాబు ఏపీకి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న తరుణంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Next Story