Mon Dec 23 2024 20:01:03 GMT+0000 (Coordinated Universal Time)
తొక్కిసలాట ఘటనలపై ప్రభుత్వం సీరియస్
కందుకూరు, గుంటూరు ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలపై విచారణకు ఆదేశించింది.
కందుకూరు, గుంటూరు ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలపై విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డితో కమిషన్ ఏర్పాటు చేసింది. కందుకూరులో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో ఎనిమిది మంది, గుంటూరులో జరిగిన సభలో ముగ్గురు తొక్కిసలాట జరిగి మరణించిన సంగతి తెలిసిందే.
కమిషన్ ఏర్పాటు...
ఈ ఘటనల ఆధారంగానే జీవో నెంబరు 1ను తీసుకు వచ్చింది. రోడ్ షోలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాటల్లో కుట్ర కోణం దాగి ఉందని విపక్ష టీడీపీ కూడా ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు, బాధ్యులను కమిషన్ విచారించనుంది. నెలరోజుల్లో ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వనుంది.
Next Story