Mon Dec 16 2024 15:47:26 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఏపీలో నిత్యావసరాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులకు నేట ినుంచి ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది
ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులకు నేట ినుంచి ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. ఇటీవల కురిసిన వర్షాలకు, సంభవించిన వరదలకు సర్వం కోల్పోయిన బాధితులకు చేయూత నిచ్చేందుకు నిత్యావసరాలను నేటి నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. వరద తగ్గుముఖం పట్టడంతో బాధితులు ఇంటికి చేరుకుంటున్నారు.
వరద బాధితులకు...
వారికి అవసరమైన ఉప్పు, బియ్యం, నూనె, చింతపండుతో పాటు ఉల్లిపాయలు, కూరగాయలు కూడా పంపిణీ చేయనున్నారు. ప్రధానంగా విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతం బాగా దెబ్బతినింది. ఈ ప్రాంతంలో బాధితులతో పాటు విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాల్లో నీట మునిగిన ప్రాంతాలకు వెళ్లి నిత్యావసరాలను అందచేయనున్నారు.
Next Story