Fri Dec 20 2024 17:21:40 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : మందుబాబులకు శుభవార్త.. నోటిఫికేషన్ కు రెడీ
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ లవర్స్ కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది.
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ లవర్స్ కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది. దీంతో మద్యం తక్కువ ధరలకు లభ్యమవుతాయి. 99 రూపాయలకే క్వార్టర్ మద్యం బాటిల్ లభిస్తుందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో పాటు కావాల్సిన బ్రాండ్లు లభించలేదు. కానీ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అన్ని రకాల బ్రాండ్లను విక్రయించేలా ప్లాన్ చేసింది. ఇప్పటికే కొన్ని బ్లాండ్లు అందుబాటులోకి వచ్చాయి. మద్యంప్రియులు తమకు ఇష్టమైన బ్రాండ్లను కొనుగోలు చేసేందుకు వీలుగా కొత్త విధానాన్ని రూపొందించింది.
నోటిఫికేషన్ విడుదలకు...
దీంతో పాటు కొత్త మద్యం దుకాణాల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమయింది. రెండు, మూడు రోజుల్లోనే మద్యం దుకాణాల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని తెలిసింది. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసిన సంగతి తెలిసందే. దీంతో వైసీపీ చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం పొంది, ఆర్డినెన్స్ ఆమోదానికి సవరణ బిల్లును గవర్నర్ వద్దకు పంపింది. రెండు రోజుల్లో గవర్నర్ నుంచి ఆమోదం పొందే అవకాశముంది. ప్రభుత్వం 3,736 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుందని తెలిసింది. ఇందులో 340 దుకాణాలు కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేయనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Next Story