Thu Dec 19 2024 14:57:53 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ ఆరోజు నుంచే ఉచిత ప్రయాణం?
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇస్తారని తెలిసింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో పాటు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నివాసముండే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తూ ప్రమాణ స్వీకారం రోజునే చంద్రబాబు ఒక ప్రకటన చేసే అవకాశముందని తెలిసింది.
ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తొలి గ్యారంటీగా అమలు చేసిన సంగతి తెలిసిందే. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ లోనూ సూపర్ సిక్స్ లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సంకేతాలను పంపడానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ ప్రకటన ఉంటుందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. అంతా ఓకే అయి.. చంద్రబాబు అంగీకరిస్తే ఈ నెల పదమూడో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. చంద్రబాబు కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో బిజీగా ఉండటంతో ఆయన అనుమతి కోసం వేచి చూస్తున్నారు.
వీటిల్లో మాత్రమే...
అయితే ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అమలవుతుంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏపీికి చెందిన మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే ఇందుకు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ అవకాశం ఉంటుంది. అందుకు సంబంధించిన ఆధార్ కార్డు లేదా మరేదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ ఉంటే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణాలోనూ ఇదే విధానం అమలవుతుంది. సేమ్ అదే రీతిలో ఏపీలోనూ కొనసాగించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఉచిత ప్రయాణం కేవలం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సెమీ లగ్జరీ సర్వీసులకే పరిమితం చేస్తారు. మిగిలిన వాటిల్లో ఉచిత బస్సు ప్రయాణం చెల్లదని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
Next Story