బిగ్ న్యూస్.. బిగ్ బాస్‌పై ఏపీ హైకోర్టు విచారణకు గ్రీన్ సిగ్నల్
బిగ్ బాస్.. అంటే ఇప్పుడు తెలియని వారు లేరు.. ఎన్నో భాషల్లో ప్రసారం అవుతున్నా.. తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది.
బిగ్ బాస్.. అంటే ఇప్పుడు తెలియని వారు లేరు.. ఎన్నో భాషల్లో ప్రసారం అవుతున్నా.. తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. ఇప్పటికే సక్సెస్ఫుల్ షోగా 5 సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్. టీఆర్పీ రేటింగ్ లో నెంబర్ వన్ గా నిలుస్తోంది. దీనికి తోడు ఈ షో ఇప్పుడు 24 గంటల పాటు ఓటీటీ వేదికగా ప్రసారం అవుతోంది. కంటెంట్ కొంత అసభ్యకరంగా ఉన్నప్పటికీ జనాల నుంచి రెస్పాన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. సినీ హీరోలు, సీరియల్ ఆక్టర్స్, సోషల్ మీడియా సెలెబ్రేటీస్, టీవీ యాంకర్లు, హాట్ సెలెబ్రేటీస్, కమీడియన్స్, క్రిటిక్స్, ఇలా నవసరాలు కలగలిపిన షో బిగ్ బాస్.. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల ఎంటర్టైన్ మెంట్ దొరుకుతుంది.. అయితే ఒకప్పుడు బిగ్ బాస్ అంటే ఆసక్తి ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండేది.. సీజన్లు పెరుగుతున్న కొద్ది షోలో అసభ్యకర సన్నివేశాలు దర్శనమిస్తున్నాయి. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులను సైతం ఆశ్రయించారు. ఫ్యామిలీస్ తో చూసే షోలో ఇలాంటి అసభ్యకర విజ్యువల్స్ ఎలా చూపిస్తారంటూ వస్తున్న విమర్శలపై ఏపీ హైకోర్టు స్పందించింది.. ఈ విషయమై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.