Mon Dec 23 2024 12:34:58 GMT+0000 (Coordinated Universal Time)
మమ్మల్ని అన్యాయంగా తొలగించారు... బాబుకు వినతి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని గ్రూపు 1 అభ్యర్థులు కలిశారు. తమను ఇంటర్వ్యూల నుంచి అకారణంగా తొలగించారని వారు ఆరోపించారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని గ్రూపు 1 అభ్యర్థులు కలిశారు. తమను ఇంటర్వ్యూల నుంచి అకారణంగా తొలగించారని వారు ఆరోపించారు. 2018 గ్రూపు 1 పరీక్షల్లో డిజిటల్ మార్కుల లెక్కింపునకు, సాధారణ మార్కుల లెక్కింపునకు ఫలితాల్లో భారీ తేడా వచ్చిందని వారు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. మూల్యాంకనలో అవకతవకలు కారణంగాగా తాము నష్టపోయామని వారు వినతి పత్రాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సమర్పించారు.
అక్రమాలు....
2018 గ్రూపు - 1 ఇంటర్వ్యూ లో 202 మంది అభ్యర్థులను జాబితా నుంచి తొలగించారని వారు ఆరోపించారు. సాధారణ మూల్యాంకనం పేరిట ఏపీపీఎస్సీ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని, అక్రమాలు చోటు చేసుకున్నాయని వారు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు చంద్రబాబును కోరారు.
Next Story