Mon Dec 23 2024 13:39:10 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గవర్నర్ వద్దకు టీడీపీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను నేడు తెలుగుదేశం సభ్యుల బృందం కలవనుంది
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను నేడు తెలుగుదేశం సభ్యుల బృందం కలవనుంది. చంద్రబాబు అరెస్ట్తో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ కు వివరించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు రాజ్భవన్ అపాయింట్మెంట్ లభించింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించనుంది. గత నలభై రోజుల నుంచి చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉండటం, ఆయన ఆరోగ్యం క్షీణించడంపై కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనుంది.
అన్ని విషయాలను...
దీంతో పాటు గవర్నర్ అనుమతి లేకుండానే ఆయనను అరెస్ట్ చేయడంపైనే టీడీపీ సుప్రీంకోర్టులో వాదనలు చేస్తున్న సంగతి తెలిసిందే. 17 ఎ నిబంధనను పట్టించుకోలేదని ఆయనకు ఫిర్యాదు చేయనుంది. పార్టీ అధినేతను అక్రమంగా జైలులో పెట్టారని తాము శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే వారిపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణ చేయనుంది. గవర్నర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత యనమల రామకృష్ణుడితో పాటు మరి కొందరు నేతలు కలవనున్నారు.
Next Story