Thu Dec 19 2024 12:24:44 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని పై కేసు నమోదు
మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడాలి నానితో పాటు మరికొందరిపై ఈకేసులు నమోదు చేశారు. తమను వేధించి బలవంతంగా రాజీనామాలు చేయించారని కొడాలి నానితో పాటు ఆయన ప్రధాన అనుచరుడు శశిభూషణ్ తో పాటు మరో ముగ్గురిపై రాజీనామా చేసిన వాలంటీర్లు ఫిర్యాదు చేశారు.
తొలి కేసు...
దీంతో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన అనుచరుడు తమను బెదిరించి తమ చేత బలవంతంగా వాలంటీర్ల పదవికి రాజీనామా చేయించారని ఇచ్చిన ఫిర్యాదును తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తొలి కేసు కొడాలి నానిపైనే ఏపీలో బుక్ అయిందని భావించాలి.
Next Story