Thu Dec 19 2024 13:11:54 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. బ్రేక్ మాత్రమే
రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తెలిపారు
రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తెలిపారు. తాను ఇకపై వ్యాపారాలపై దృష్టి పెడతానని అన్నారు. మళ్లీ అవకాశం వచ్చినప్పుడు తిరిగి పోటీ చేస్తానని తెలిపారు. రాజకీయాలు ఒకసారి వదిలేస్తే మళ్లీ రావడం కష్టమని కొందరు అంటున్నారని ఆయన అన్నారు. అవకాశం అంటూ మళ్లీ వస్తే పోటీ చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని గల్లా జయదేవ్ ఆత్మీయ సమావేశంలో స్పష్టం చేశారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా....
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగుంటే పరవాలేదని, అవి దెబ్బతినే విధంగా ఉంటే మాత్రం ఇబ్బంది పడతామని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. పదేళ్లు తాను ప్రజలకు సేవ చేశానని, ఇప్పుడు బ్రేక్ తీసుకుంటానని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితివస్తుందని ఎప్పడూ అనుకోలేదని గల్లా జయదేవ్ అన్నారు. రాముడు పథ్నాలుగు ఏళ్లు వనవాసం వెళ్లి పరాక్రమవంతుడిగా తిరిగి వచ్చారని గల్లా జయదేవ్ అన్నారు. అలాగే తాను కూడా తిరిగి వస్తానని తెలిపారు.
Next Story