Thu Dec 19 2024 13:03:55 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గల్లా జయదేవ్ ఆత్మీయ విందు
గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ నేడు కార్యకర్తలతో సమావేశం కానున్నారు
గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ నేడు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వారికి ఆత్మీయ విందు ఇవ్వనున్నారు. రాజకీయాల నుంచి తాను తప్పుకునే ప్రకటన ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్ చేయనున్నారు. తనను రెండుసార్లు గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి గెలిపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని నేడు గల్లా జయదేవ్ చేపట్టారు.
ప్రకటన చేసేందుకు...
సమావేశం అనంతరం గల్లా జయదేవ్ వారికి భారీ విందును కూడా ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంగా ఇప్పటికే ప్రచారం బయటకు రావడంతో గల్లా జయదేవ్ ఈరోజు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. గుంటూరులోని ఒక ప్రయివేటు ఫంక్షన్ హాలులో ఈ ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు.
Next Story