Mon Dec 23 2024 14:33:38 GMT+0000 (Coordinated Universal Time)
బాలికతో వ్యభిచారం కేసులో పురోగతి.. ముఠా అరెస్ట్ !
గుంటూరు జిల్లాలో మైనర్ బాలికను వ్యభిచార వృత్తిలోకి దించిన ముఠాను అరెస్ట్ చేసినట్లు అర్బన్ ఎస్పీఅరిఫ్ హఫీజ్ తెలిపారు. ఈ ముఠాలో మొత్తం 23
ఏడు నెలల క్రితం ఓ బాలికకు కరోనా సోకడంతో.. నయం చేస్తానని నమ్మించిన ఒక మహిళ బలవంతంగా ఆ బాలికతో వ్యభిచారం చేయించింది. బాలిక తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో నిర్వాహకులు ఆమె వదిలేశారు. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గుంటూరు జిల్లాలో మైనర్ బాలికను వ్యభిచార వృత్తిలోకి దించిన ముఠాను అరెస్ట్ చేసినట్లు అర్బన్ ఎస్పీఅరిఫ్ హఫీజ్ తెలిపారు. ఈ ముఠాలో మొత్తం 23 మంది ఉండగా.. 10 మంది నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి : కరోనా నయం చేస్తానని నమ్మంచి.. 13 ఏళ్ల బాలికతో వ్యభిచారం
పారిపోయినా వదల్లేదు..
కరోనా సమయంలో జీజీహెచ్ లో చేరిన బాలికకు స్వర్ణకుమారి అనే మహిళ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, ప్రకృతి వైద్యం పేరుతో.. వ్యభిచార కూపంలోకి దింపినట్లు తమ విచారణలో తేలిందని వెల్లడించారు. బాలికతో.. విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, నెల్లూరులో వ్యభిచారం చేయించారు. ఆ తర్వాత బాలిక నెల్లూరు నుంచి పారిపోయి విజయవాడ చేరుకోగా.. అక్కడ మళ్లీ బాలికను పట్టుకుని మరోమారు బలవంతంగా వ్యభిచారం చేయించినట్లు అర్బన్ ఎస్పీ వివరించారు. బాలిక అనారోగ్యం బారిన పడటంతో.. ఆమెను ముఠా వదిలేసిందని పేర్కొన్నారు. కాగా.. ముఠా సభ్యుల నుంచి 12 సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలు, రూ.1000 నగదు, కారు, ప్రామిసరీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story