Mon Dec 23 2024 14:48:37 GMT+0000 (Coordinated Universal Time)
విద్యాసంస్థలే టార్గెట్ గా గంజాయి స్మగ్లింగ్.. ముఠా అరెస్ట్
విద్యాసంస్థలే టార్గెట్ గా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్యాసంస్థలే టార్గెట్ గా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన గంజాయి, రూ.1.50 లక్షలు విలువచేసే లిక్విడ్ గంజాయితో పాటు మూడు కార్లు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించిన వివరాల మేరకు.. ఈ మధ్యకాలంలో గుంటూరులో కాలేజీలు, విద్యాసంస్థలే టార్గెట్ గా అక్రమార్కులు గుంటూరులో గంజాయి అక్రమ అమ్మకాలను మొదలుపెట్టారని తెలిపారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.
పక్కా సమాచారంతో...
కొంతకాలంగా ఈ ప్రాంతంలో గంజాయి అక్రమ అమ్మకాలు, స్మగ్లింగ్ జరుగుతుందని తెలుసుకున్న అధికారులు.. వాటి మూలాలను కనుగొనాలని పోలీసులు ఆదేశించారు. ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేయగా.. సిద్దాబత్తుల వినయ్, కుర్రా వెంకటేష్ అనే వ్యక్తులు విశాఖ జిల్లాలో పాడేరులో గంజాయిని కొనుగోలు చేసి కార్లలో గుంటూరుకు తరలిస్తే, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు అబూబకర్ అనే మరో వ్యక్తి దానిని చేరవేసేవాడని తేలిందన్నారు.
కేరళ, కర్నాటకలకు....
అబూబకర్ నుండి ఇసాక్ వామన్, మహమ్మద్ ఇషాన్ అనేవారు కేరళ, కర్నాటక రాష్ట్రాలలో గంజాయిని విక్రయిస్తున్నారు. తాజాగా.. గుంటూరు బైపాస్ లో కార్లలో గంజాయిని మారుస్తుండగా.. పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నట్లుఅర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు. వారి వద్ద నుంచి కార్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆరుగురు నిందితులను రిమాండ్ కు తరలించారు.
Next Story