Mon Dec 23 2024 04:06:23 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ తీరుపై గుంటూరు వైసీపీ నేతల ఆగ్రహం
గుంటూరు జిన్నా టవర్ గురించి గురించి మాట్లాడుతూ.. జిన్నా గొప్ప న్యాయవాది అని, ఆయన దేశ స్వాతంత్య్ర సమరంలో
గుంటూరు జిల్లా వైసీపీ నేతలు.. బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో జాతి, మత బేధాలు మరచి.. అందరూ కలిసి మెలిసి ఉంటున్న సమయంలో ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. మత శక్తుల, విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.
గుంటూరు జిన్నా టవర్ గురించి గురించి మాట్లాడుతూ.. జిన్నా గొప్ప న్యాయవాది అని, ఆయన దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. అనవసరంగా వివాదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని బీజేపీ నేతలను హెచ్చరించారు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పదనమన్నారు. అలాంటి దేశంలో పుట్టి.. రాజకీయాలు చేస్తూ.. తమ పబ్బం గడుపుకునేందుకు కొందరు నేతలు వివాదాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
Next Story