Thu Dec 19 2024 14:36:01 GMT+0000 (Coordinated Universal Time)
Kasu Mahesh Reddy : హాట్ కామెంట్స్ చేసిన కాసు మహేష్ రెడ్డి
వైసీపీలో టిక్కెట్ల కేటాయింపుపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు
వైసీపీలో టిక్కెట్ల కేటాయింపుపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అయితే పల్నాడు జిల్లాలో ఆశావహులు మాత్రమే ఉన్నారు కానీ అసంతృప్తి వాదులు లేరన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ బలంగా ఉందన్నారు. బలంగా ఉన్న పార్టీలోనే ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. జంగా కృష్ణమూర్తికి గురజాల టిక్కెట్ ను కోరే హక్కు ఉందన్న ఆయన తాను కాసు బ్రహ్మానందరెడ్డి వారసుడిగా ఎవరికీ అన్యాయం చేయబోనని అన్నారు. జగన్ ఏం చెబితే అది చేస్తానని ఆయన తెలిపారు.
తప్పేముంది?
ఆశావహులు ఉండటంలో తప్పు లేదన్నారు. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వస్తే రావచ్చని, వాటిని అధిగమించి ముందుకు వెళతామని కాసు మహేష్ రెడ్డి అన్నారు. గురజాలలో తాను జంగా కృష్ణమూర్తి మాత్రమే కాకుండా మరికొందరు నేతలు కూడా టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారన్నారు. అయితే టిక్కెట్ కేటాయించడం జగన్ ఇష్టమని అన్నారు. సర్వేల నివేదికల ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు జరుగుతుందని కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదని అన్నారు.
Next Story