Thu Dec 19 2024 08:55:22 GMT+0000 (Coordinated Universal Time)
పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరు : కాసు మహేష్ రెడ్డి
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఒకవర్గం మీడియా నిందలు వేస్తుందని గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఒకవర్గం మీడియా నిందలు వేస్తుందని గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎ వీడియోను మాత్రమే చూపుతున్నారని, అంతకు రెండు గంటల ముందు ఏం జరిగిందో కూడా వీడియోలు విడుదల చేయాలని మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతకు ముందు వీడియోలు కూడా విడుదల చేయాలని ఆయన కోరారు. ఒకటే వీడియోను ఎందుకు బయటకు విడుదల చేశారని ఆయన ప్రశ్నించారు.
రీపోలింగ్ జరపాలని కోరినా...
టీడీపీ హయాంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. పిన్నెల్లిని కావాలనే టార్గెట్ చేస్తూ ఒక ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేశారన్నారు. అనేక గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందని తాము ఆరోపిస్తున్నా ఎందుకు రీపోలింగ్ కు ఆదేశాలు ఇవ్వడం లేదని కాసు మహేష్ రెడ్డి ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. రిగ్గింగ్ జరిగిందని తాము చెబుతుంటే ఆ వీడియోలు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. పిన్నెల్లి తప్పు చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని కాసు మహేష్ రెడ్డి తెలిపారు.
Next Story