Mon Dec 23 2024 14:54:37 GMT+0000 (Coordinated Universal Time)
హోదా ప్రస్తావనే ఉండదు
ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశమని, హోంశాఖ కమిటీకి సంబంధం లేదని జీవీఎల్ నరసింహారావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశం దీనికి హోంశాఖ కమిటీకి సంబంధం లేదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా అంశాన్ని ఈ కమిటీలో చర్చించే అవకాశం లేదని ఆయన చెప్పారు. ఉదయం అజెండాలో ప్రత్యేక హోదా అంశం ఉండటంపై తాను హోంశాఖ అదికారులతో మాట్లాడానని, వారు అజెండాలో ఈ అంశం లేదని చెప్పారన్నారు.
ఏపీకి సంబంధించిన...
కేవలం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, విభజన సమస్యల పరిష్కారానికే ఈ కమిటీ నియామకం జరిగిందన్నారు. అలాగే రిసోర్స్ గ్యాప్ పై కూడా ఈ కమిటీ చర్చించదని చెప్పారు. అయితే ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ కు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
Next Story