Sun Dec 14 2025 06:11:38 GMT+0000 (Coordinated Universal Time)
21 నుంచి ఇంటర్ హాల్ టిక్కెట్లు
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టిక్కెట్లు ఈ నెల 21 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారు

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టిక్కెట్లు ఈ నెల 21 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 21న ఏపీ ఇంటర్ హాల్టిక్కెట్లు విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు వివరించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
మార్చి నుంచి...
అదే విధంగా మార్చి 2వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఆ తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించుకోవాలని సూచించారు.
Next Story

