Mon Mar 31 2025 04:54:39 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కొత్త డీజీపీ ఈయనేనట?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశముందని తెలిసింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశముందని తెలిసింది. 1992 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను ఏపీకి నూతన డీజీపీగా నియమించే అవకాశాలున్నాయని అధికారికవర్గాలు వెల్లడించాయి.
31న పదవీ విరమణ...
ప్రస్తుత డీజీపీ ద్వారాకా తిరుమల రావు ఈనెల 31వ తేదీనపదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో హరీశ్‌కుమార్ గుప్తాను డీజీపీగా నియమించనున్నట్లు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీశ్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను నియమిస్తారని అధికారికవర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
Next Story