Fri Dec 20 2024 22:22:15 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : జగన్ మాయ మాటలు నమ్మకండి.. నమ్మించి మోసం చేస్తాడు
కడపకు జగన్ ఏమైనా అభివృద్ధి చేశారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.
కడపకు జగన్ ఏమైనా అభివృద్ధి చేశారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కడప జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల గురించి అయినా ఈ ఐదేళ్లలో పట్టించకున్నారా? అని నిలదీశారు. ప్రొద్దుటూరులో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయడం మినహా చేసిందేమీ లేదన్నారు. తాను అధికారంలో ఉండి ఉంటే ప్రారంభించేవాడినని చెప్పారు. జగన్ మాయమాటలను నమ్మవద్దని తెలిపారు.
సీమకు నీళ్లు నేనే తెస్తా...
జగన్ సభకు జనం రావడం లేదని, పోలీసులు అతికష్టం మీద వచ్చిన వారిని పోకుండా అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో తమ ప్రభుత్వం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఐదేళ్లలో జగన్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు మాత్రమేనని అన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలన్నదే తన ఆలోచన అని అన్నారు. కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకురావాలనేది తన కలి ఆయన చెప్పుకొచ్చారు. పోలవరం పూర్తి చూసి గోదావరి జలాలను కూడా రాయలసీమకు తరలిస్తామని తెలిపారు. రాయలసీమలో ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ అయినా జగన్ పెట్టగలిగారా? అని ప్రశ్నించారు.
Next Story