Mon Dec 23 2024 19:10:21 GMT+0000 (Coordinated Universal Time)
కౌన్సిలింగ్ పేరుతో బాలికపై హెడ్ కానిస్టేబుల్ అఘాయిత్యం
ఆమె తండ్రితో పాటు బాలికను ఇంటికి పిలిపించుకున్నాడు సుధాకర్. బాలిక తండ్రికి సమీపంలోని షాపులో ఓ పని పురమాయించి పంపించాడు. బాలిక ఒంటరిగా ఉండటంతో..
కౌన్సిలింగ్ పేరుతో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో హెడ్ కానిస్టేబుల్. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు పీఎస్ లో సుధాకర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఒక సమస్యపై బాలికకు కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ.. ఆమె తండ్రితో పాటు బాలికను ఇంటికి పిలిపించుకున్నాడు సుధాకర్. బాలిక తండ్రికి సమీపంలోని షాపులో ఓ పని పురమాయించి పంపించాడు.
బాలిక ఒంటరిగా ఉండటంతో.. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు సుధాకర్. ఇంటికి వెళ్లగానే జరిగిన విషయం గురించి తండ్రికి చెప్పి బోరుమంది బాలిక. దాంతో బాలిక తండ్రి బిట్టమూరు పోలీసులకు హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సుధాకర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. బాలికపై సుధాకర్ అత్యాచారయత్నం చేసినట్లు తేలడంతో ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి.. అతడిని రిమాండ్ కు తరలించారు.
Next Story