Wed Dec 25 2024 01:43:43 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ముందస్తు బెయిల్ విచారణ రేపటికి వాయిదా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ రేపటికి వాయిదా పడింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. సీఐడీ వాదనలు వినేందుకు హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని, భారీగా నష్టం చేకూర్చేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించిందని ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసింది.
ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ...
అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ విధానం మేరకే తాము ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు రూపొందించామని, దాని నిర్మాణం కూడా జరగలేదని చంద్రబాబు తరుపున న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల చంద్రబాబుతో పాటు సన్నిహితులు ప్రయోజనం పొందేలా చేశారని సీఐడీ తరుపున న్యాయవాదులు చెబుతున్నారు.
Next Story