Fri Dec 20 2024 18:46:53 GMT+0000 (Coordinated Universal Time)
టెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉందిగా
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు కూడా సుప్రీంకోర్టు ధర్మాసంన ఇరువర్గాల వాదన విననుంది. ఈరోజు క్వాష్ పిటీషన్ పై సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ప్రధానంగా 17ఎ మీదనే చంద్రబాబు తరుపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. అయితే ఈ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేదీ చేసిన వ్యాఖ్యలు ఒకరకంగా సంచలనంగా మారాయి. 17 ఎ అనేది అవినీతి నిరోధానికి మాత్రమే ఉండాలి తప్ప నిందితులను రక్షించడం కోసం కాదు కదా? అని వ్యాఖ్యానించారు.
రేపటికి వాయిదా...
దీనిపై రేపు సీఐడీ తరుపున న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు చేయనున్నారు. రేపు క్వాష్ పిటీషన్ పై తీర్పు వచ్చే అవకాశముంది. ఈరోజు దాదాపు రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ నిమిత్తం రేపటికి వాయిదా వేసింది. మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ తో పాటు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ ను కూడా కొట్టివేశారు. దీంతో రేపు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కొనసాతూనే ఉంది.
Next Story