Mon Dec 23 2024 00:58:34 GMT+0000 (Coordinated Universal Time)
కస్టడీ పిటీషన్ రేపటికి వాయిదా
స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది
స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. సమయం మించి పోవడంతో బెయిల్ పిటీషన్ తో పాటు రిమాండ్ పిటీషన్ కూడా రేపు విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. దీంతో రేపటికి చంద్రబాబుకు సంబంధించిన అన్ని పిటీషన్లు రేపటికి వాయిదా పడ్డాయి. సమయం మించి పోవడంతోనే అన్ని పిటీషన్లను న్యాయమూర్తి వాయిదా వేశారు. దీంతో పాటు హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతనే ఏసీబీ కోర్టులో విచారణ పూర్తయి తీర్పులు బెయిల్పై రానున్నాయి.
బెయిల్ కూడా...
ఏసీబీ కోర్టులో ఈ స్కిల్ డెవలెప్మెంట్ కేసులో మరింత లోతుగా అధ్యయనం చేయాలంటే ఆయనను మరింతగా విచారించాలని, అందుకు ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని సీఐడీ తరుపున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను కూడా రేపటికి వాయిదా వేశారు. అయితే చంద్రబాబు అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ కోర్టు ఆయనకు ఈ నెల 22వ తేదీ వరకూ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అలాగే బెయిల్ పిటీషన్ కూడా రేపటికి విచారణ వాయిదా పడింది. రేపు ఈరెండు పిటీషన్లపై విచారణను న్యాయమూర్తి చేపట్టనున్నారు.
Next Story