Thu Dec 19 2024 09:41:30 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ముందస్తు బెయిల్పై విచారణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. హైకోర్టులో ఈ విచారణ జరగనుంది. ఇసుక కుంభకోణం కేసులో చంద్రబాబును నిందితుడిగా చేరుస్తూ సీఐడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల విషయంలోనూ కేసులను బనాయిస్తున్నారని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. తనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేయాలని కోరారు.
ఉచిత ఇసుక...
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుక ఉచితంగా అందించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే దీనివల్ల పది వేల కోట్ల రూపాయలకు పైగానే ప్రభుత్వ ఖజానాకు గండి పడిందని సీఐడీ ఆరోపిస్తుంది. ఈకేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు దేవినేని ఉమ, పీతల సుజాతలను కూడా నిందితులుగా పేర్కొంది. దీనిపై చంద్రబాబు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.
Next Story