Mon Dec 23 2024 07:43:59 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బెయిల్ విచారణ వాయిదా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటీషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటీషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ఈ రెండు కేసుల విచారణను రేపటికి వాయిదా వేశారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు ఈ నెల 8వ తేదీన అరెస్టయ్యారు. ఈ నెల10వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
సెలవు కావడంతో...
చంద్రబాబు బెయిల్ పిటీషన్ ను దాఖలు చేసుకున్నారు. అదే సమయంలో తమకు కేటాయించిన రెండు రోజుల కస్టడీలో కూడా విచారణకు చంద్రబాబు సహకరించలేదని, మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ తరుపున న్యాయవాదులు పిటీషన్ వేశారు. నిన్న న్యాయమూర్తి రెండు కేసులను ఈరోజుకు వాయిదా వేశారు. అయితే ఈరోజు సెలవులో ఉండటంతో రెండు కేసులు రేపు ఏసీబీ కోర్టులో విచారణకు రానున్నాయి.
Next Story