Mon Dec 23 2024 15:59:27 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ విచారణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై నేడు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించనుంది. చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో అధికారులను బెదిరిస్తున్నారని కూడా ప్రభుత్వం పిటీషన్ లో పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు.
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో...
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయి యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉండి తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకు బెయిల్ లభించిందని, అయితే ఆయనకు బయటకు వచ్చి అధికారులను బెదిరిస్తుండటంతో బెయిల్ రద్దు చేయాలని సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరగనుంది. దీంతో చంద్రబాబు బెయిల్ రద్దుపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Next Story