Thu Dec 19 2024 18:43:21 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : బెయిల్ రద్దుపై నేడు విచారణ
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంపై సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాము సరైన సాక్ష్యాధారాలను సమర్పించినా హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై సీఐడీ అభ్యంతరం తెలుపుతుంది. తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని పిటీషన్ లో పేర్కొంది.
హైకోర్టు పరిధి దాటి...
దీంతో ఈ కేసును సుప్రీంకోర్టులో నేడు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారణ చేయనుంది. ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని కూడా సీఐడీ పేర్కొంది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ కోరుతుంది. ఈరోజుతో చంద్రబాబు మధ్యంతర బెయిల్ కూడా ముగిసింది. రెగ్యులర్ బెయిల్ రావడంతో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు రానున్నదన్న దానిపైనే టీడీపీ వర్గాల్లో టెన్షన్ నెలకొంది.
Next Story