Sun Dec 22 2024 23:29:47 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైకోర్టులో విచారణ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై కూడా నేడు విచారణ జరపనున్నారు. దీంతో పాటు చంద్రబాబు వేసిన బెయిల్ పిటీషన్ పై కూడా విచారణ జరగనుంది. ఇటీవల సీఐడీ లోకేష్ ను ఎ 14గా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిందితుడిగా చేర్చడంతో ఆయన ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై నేడు విచారణ జరగనుంది.
ముందస్తు బెయిల్ పై...
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తమకు అనుకూలంగా మార్చి లబ్ది పొందేందుకు ప్రయత్నించారని గత ఏడాది సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఏ1, మాజీ మంత్రి నారాయణ ఏ2 నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ వేశారు. దీనిపై నేడు వాదనలను జరగనున్నాయి. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది.
Next Story