Thu Dec 19 2024 00:00:01 GMT+0000 (Coordinated Universal Time)
Pinnelli : మాజీ ఎమ్మ్యెల్యే పిన్నెల్లి బెయిల్ విచారణ ఎల్లుండికి వాయిదా
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే న్యాయస్థానం విచారణను మరోసారి ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే న్యాయస్థానం విచారణను మరోసారి ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికల సందర్భంగా, తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన వివిధ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు అయింది.
నెల్లూరు జైలులో...
దీంతో పోలీసులు అరెస్ట్ చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకు తరలించారు. కొన్ని నెలలుగా ఆయన నెల్లూరు జైలులో ఉన్నారు. ఆయన వరసగా పెట్టుకున్న బెయిల్ పిటీషన్లను న్యాయస్థానం కొట్టిపారేసింది. అయితే ఈసారి మాత్రం విచారణకు స్వీకరించింది. ఈరోజు జరిగే విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
Next Story