Mon Dec 23 2024 07:03:24 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తీర్పు రేపు.. బెయిల్ పై
చంద్రబాబు అంగళ్లు బెయిల్ పిటీషన్ పై విచారణ ముగిసింది. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది
చంద్రబాబు అంగళ్లు బెయిల్ పిటీషన్ పై విచారణ ముగిసింది. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. రేపు దీనిపై తీర్పు ప్రకటించనుంది. చిత్తూరు జిల్లాలో అంగళ్లు వద్ద పోలీసులపై జరిగిన దాడి కేసులో చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.
లోకేష్ ముందస్తు బెయిల్పై....
నిన్న ఇన్నర్ రింగ్ రోడ్డులోనూ ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు ఈరోజు అంగళ్లు కేసులో విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటీషన్ ను కూడా హైకోర్టు డిస్పోజ్ చేసింది. లోకేష్ కు 41 ఎ నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతామని సీఐడీ తరుపున న్యాయవాదులు న్యాయస్థానానికి చెప్పారు.
Next Story