Thu Dec 26 2024 11:27:05 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించారని, దీనిపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలని కోరనున్నారు.
సుబ్రహ్మణ్య స్వామి కూడా...
అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా తిరుమల లడ్డూ వివాదంపై పిటీషన్ వేశారు. ఆయన తన వాదనలను తానే వినిపించనున్నారు. తిరుమల లడ్డూ వివాదంలో నిజాలను నిగ్గు తేల్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తో సాధ్యం కాదని, ఆ విచారణ ఏకపక్షంగా సాగుతుందని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ వ్యవహారంపై న్యాయవిచారణకు ఆదేశించాలని ఆయన కోరనున్నారు.
Next Story