Mon Dec 23 2024 02:31:52 GMT+0000 (Coordinated Universal Time)
Pinnelli : నేడు పిన్నెల్లి పిటీషన్ పై విచారణ
వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికల సందర్భంగా తనపై నమోదయిన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలని ఆయన పిటీషన్ లో కోరారు. విచారణ అధికారులు కేవలం వైసీపీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశారని, ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయన ఈ పిటీషన్ దాఖలు చేశారు.
విచారణ అధికారులను...
వీళ్లు విచారణ అధికారులుగా ఉంటే తమకు న్యాయం జరగదని కోరారు. విచారణ అధికారులను మార్చి ఘర్షణలకు కారుకైలన వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు. తాము ఇచ్చిన ఫిర్యాదులను కూడా పట్టించుకోలేదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఇరువర్గాల వాదనలను విననుంది.
Next Story