Fri Nov 22 2024 20:18:43 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విచారణ.. టెన్షన్
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నేడు హైకోర్టులో ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు అనుకూలంగా కోర్టు నుంచి ఉత్తర్వులు రావాలంటూ ఉదయం నుంచే పార్టీ కార్యకర్తలు పూజలు నిర్వహిస్తున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో చట్ట విరుద్ధంగా చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ ఆయన తరుపున న్యాయవాదులు వాదించారు. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి హైకోర్టు సమయం ఇవ్వడంతో నేడు పిటీషన్ పై ఉత్కంఠ నెలకొంది.
పది రోజుల నుంచి...
స్కిల్ డివలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈ నెల 22వ తేదీ వరకూ రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే ఈ కేసులో లోతుగా విచారించడానికి చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ పిటీషన్ వేసింది. దీనిపై కూడా ఈరోజు వాదనలు జరగనున్నాయి. దీంతో పాటు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపైన కూడా విచారణ జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు ఇప్పటికే పది రోజుల నుంచి జైలులో ఉండటంతో ఆయన బయటకు రావాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story