Tue Nov 05 2024 15:25:34 GMT+0000 (Coordinated Universal Time)
నేడు, రేపు ఏపీలో తీవ్ర వడగాల్పులు
నేడు 73 మండలాల్లో తీవ్రగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి, బాపట్ల, తూర్పుగోదావరి, ఏలూరు
తెలుగు రాష్ట్రాలపై సూర్యుడు కన్నెర్ర చేస్తున్నాడు. రోహిణి కార్తె మొదలైనప్పటి నుంచి వేడి గాలుల తీవ్రత, ఉక్కపోత మరింత పెరిగింది. రాష్ట్రం పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటుతున్నాయి. శనివారం (మే27) తూర్పుగోదావరి జిల్లా చిన్నయ్యగూడెంలో గరిష్ఠంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా గూడూరులో 44.6 డిగ్రీలు, బాపట్ల జిల్లా కావూరు, ఏలూరు జిల్లా పెదవేగిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే పలు మండలాల్లో వడగాలులు వీచాయి.
నేడు 73 మండలాల్లో తీవ్రగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి, బాపట్ల, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, కృష్ణా, పల్నాడు, కడప జిల్లాల్లోని మండలాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇతర ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే సోమవారం (మే29) 12 మండలాలపై వడగాలుల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. అల్లూరి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది.
Next Story