Sun Dec 22 2024 22:15:01 GMT+0000 (Coordinated Universal Time)
హెచ్చరిక : రెండ్రోజులు వడగాల్పులు
తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీలో కొన్ని మండలాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు..
ఈరోజు నుండి ఎండల తీవ్రత మరింత పెరగనుంది. రోహిణి కార్తె ప్రభావం నేటి నుంచి జూన్ 8 వరకు ఉండనుంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీలో కొన్ని మండలాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు, వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. గురువారం 17, శుక్రవారం 147 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బుధవారం కడప, నంద్యాల, ఎన్టీఆర్, అనకాపల్లి, శ్రీకాకుళం, పల్నాడు జిల్లాల్లో వడగాలులు ప్రజలను వేధించాయి. నిన్న శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరులో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా మాచర్లలో 44,7, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం సమయంలో ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమలోనూ అక్కడక్కడా జల్లులు పడ్డాయి.
Next Story