Mon Dec 23 2024 03:41:24 GMT+0000 (Coordinated Universal Time)
భారీగా పెరిగిన రద్దీ.. వెలుపలికి క్యూలైన్లు
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి.. క్యూలైన్లు కాంప్లెక్స్ వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు వస్తున్నారు.
కాగా.. నిన్న(జూన్1) శ్రీవారిని 62,407 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 33,895 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా గురువారం స్వామివారికి రూ.4.56 కోట్ల హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది. కాగా.. తిరుమల సన్నిథిలో మరో అతిథిగృహం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఫోనిక్స్ పవర్ అండ్ ఇన్ ఫ్రా సంస్థ తిరుమలలోని సన్నిధానం అతిథిగృహం సమీపంలో నిర్మించిన వేంకటేశ్వర అతిథిగృహాన్ని దాతలు గురువారం టీటీడీకి అప్పగించారు.
Next Story