Mon Dec 15 2025 08:29:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విద్యాసంస్థలకు సెలవు
వాయుగుండం తీరం దాటడటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు

వాయుగుండం తీరం దాటడటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు వాయుగుండం తీరందాటడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ యా జిల్లాల్లో విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు ఏవీ తెరవకూడదని ఆంక్షలు విధించారు.
భారీవర్షాలతో...
భారీ వర్షాలు కురుస్తుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. భారీ వర్షాలకు నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని కూడా అధికారులు సూచించారు. వాయుగుండం తీరం దాటడంతో భారీ వర్షాలు ఈ జిల్లాల్లో నమోదవుతున్నాయి.
Next Story

