Rain Alert : ఏపీలో నేటి నుంచే భారీ వర్షాలు.. అలెర్ట్ అయిన సర్కార్
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. ఈరోజుఈశాన్య రుతుపవనాలు బలంగా కోస్తాంధ్తని తాకాయి. తెలవారుజామున నుంచే తిరుపతి నుంచి వైజాగ్ వరకు అన్ని ప్రాంతాల్లో వర్షాలు బలంగా పడుతున్నాయి. తిరుపతి - నెల్లూరు డివిజన్ లో భారీ వర్షాలు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఒంగోలు, బాపట్ల బెల్ట్ లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. మచిలీపట్నం - కాకినాడ - వైజాగ్ బెల్ట్ లో కూడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు నేటి మధ్యాహ్నం వరకు కొనసాగనున్నాయి. ప్రత్యేకించి తిరుపతి - నెల్లూరు జిల్లాల్లో వర్షాల తీవ్రత అత్యథికంగా ఉండనుంది. అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల్లో ప్రస్తుతానికి వర్షాలు ప్రారంభిస్తున్నాయి. దీంతో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.