Sun Dec 22 2024 05:13:44 GMT+0000 (Coordinated Universal Time)
Cyclone Alert : ముంచుకొస్తున్న ముప్పు... అతి భారీ వర్షాలు.. హై అలెర్ట్
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు అధికారులకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు అధికారులు ప్రకటించారు. ఒక్కరోజులోనే ఇరవై సెంటీమీటర్ల వర్షం పడుతుందని అంచనాలు వినపడుతున్నాయి. అయితే అధికారులు మాత్రం ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేక బృందాలను సిద్ధ: చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతం. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. వాయుగుండం. చెన్నైకి 490 కి.మీ., పాండిచ్చేరికి 500 కి.మీ., నెల్లూరుకు 590 కి.మీ. దూరంలో కేంద్రీకృతమయిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 17న పుదుచ్చేరి - నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాలు...
వాయుగుండం ప్రభావంతో ఇవాళ విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు దక్షిణకోస్తా తో పాటు రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరించింది. రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని ఆంక్షలు విధించింది.ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే తప్ప ఈ జిల్లాల ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఇళ్లలోనే ఉండాలని, సేఫ్ గా ఉండటానికి ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీరప్రాంతాల్లో ఇప్పటికే అనేక మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రధానంగా తిరుపతి, నెల్లూరులో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నెల్లూరు జిల్లాలో...
పెన్నా పరీవాహక లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీవర్షాల తో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు , కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు ప్రజలు. దూరంగా ఉండాలని సూచించారు. ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదన్నారు. పాత భవనాలు వదిలి ముందుగానే సురక్షిత భవనాల్లోకి వెళ్ళాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కింది.
ఫ్లాష్ ఫ్లడ్ ఏర్పడే...
నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రెడీగా ఉంచారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. తిరుపతి -0877-2236007, గూడూరు -8624252807, సూళ్లూరుపేట-8623295345, తిరుపతి RDO-7032157040, శ్రీకాలహాస్తి -9966524952 నంబర్లను అందుబాటులో ఉంచారు. అటు పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశముండటంతో జిల్లా యంత్రాంగం అంతా అలెర్ట్ గా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.
Next Story