Thu Dec 26 2024 05:19:22 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో భారీ వర్షం.. ఈదురుగాలులు కూడా
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు వీస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండలు మండే సమయంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు. రోహిణి కార్తె ఎండల తీవ్రతను మొన్నటి వరకూ తట్టుకోలేని ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికే భయపడ్డారు. వడదెబ్బ తగిలి అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ఎక్కువ మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గతలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.
ఈ జిల్లాల్లో...
అయితే ఈరోజు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షం కురియడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. విశాఖ, కాకినాడ, శ్రీకాకుళంలో భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి తోడు ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఈదరుగాలులు, వర్షం ధాటికి అనే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు మండే ఎండల్లో కొంత సేదతీరేందుకు అవకాశం కలిగినట్లయింది. అయితే ఇవి అకాల వర్షాలు మాత్రమేనని, రుతుపవనాలు ఇంకా ప్రవేశించలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Next Story