Wed Dec 25 2024 01:35:59 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో రెండు రోజుల పాటు ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
భారీ వర్షాల నేపథ్యంలో...
భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Next Story